టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ కోలీవుడ్‌లో తమ నాలుగో ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. #MythriTamil04 #DV4 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ధ్రువ్ విక్రమ్ కథానాయకుడిగా ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రం పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కరణ్ ఏ. కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో పాటు రైటర్ శబితో కలిసి ఈ కథను అందించారు.
ఈ సినిమాలో పృథ్విరాజ్ మరియు సాయి దీన కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. విక్కీ సినిమాటోగ్రాఫర్‌గా, చియా ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. అలాగే ప్రవీణ్ రాజా కాస్ట్యూమ్ డిజైనర్‌గా, జి.ఎమ్. శేఖర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, మరియు వి.ఎమ్. మోర్ స్టంట్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ధ్రువ్ విక్రమ్‌ను పక్కా కమర్షియల్ మాస్ లుక్‌లో ప్రెజెంట్ చేయబోతున్న ఈ ప్రాజెక్ట్‌పై తమిళ ఇండస్ట్రీలో అప్పుడే మంచి అంచనాలు మొదలయ్యాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























