ఆది పినిశెట్టి మరకతమణి 2 షూటింగ్ పూర్తి

Marakathamani 2 Shooting Completed

ఆది పినిశెట్టి హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ ‘మరకతమణి’. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న‘మరకతమణి 2’ షూటింగ్ పూర్తయిందని మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2017లో విడుదలైన ఒరిజినల్ చిత్రం తమిళం, తెలుగులో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఫ్రాంచైజీ అభిమానులకు ఇప్పటికీ గుర్తుండిపోయే ఎన్నో మధురమైన జ్ఞాపకాలను అందించింది. వివిధ భాషల ప్రేక్షకులను తన నటనతో మెప్పించిన ఆది కెరీర్‌లో కూడా ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. సీక్వెల్ ప్రకటించినప్పటి నుంచి అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ అంచనాలు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి.

ఒరిజినల్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఏఆర్‌కే శరవణ్ ఈ ఫ్రాంచైజీతోనే కొనసాగుతున్నారు. ఈ ప్రయాణంలోని ప్రతి దశలోనూ ఆయన భాగస్వామిగా ఉన్నారు. అభిమానులు సీక్వెల్‌పై పెట్టుకున్న అంచనాలను అందుకునేలా రెండో భాగాన్ని రూపొందించేందుకు ఆయన ప్రత్యేకంగా కృషి చేశారు.

ఈ చిత్రాన్ని సుధన్ సుందరం, మనీష్ సింగాల్, దుర్గారామ్ చౌదరి, దేవ్, కేవీ దురై నిర్మిస్తున్నారు. ప్యాషన్ స్టూడియోస్, డాంగల్ టీవీ, ఆర్‌డీసీ మీడియా, యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, గుడ్ షో బ్యానర్లపై ఈ చిత్రం రూపొందుతోంది. ఆది, సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, నిక్కీ గల్రాణి పినిశెట్టి, మునీష్‌కాంత్, ఆనంద్‌రాజ్, డానియే, అరుణ్‌రాజా కామరాజ్, మురుగానందం తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి ధీబు నినన్ థామస్ సంగీతం అందిస్తున్నారు. పీవీ శంకర్, దీపక్ మీనన్ సినిమాటోగ్రఫీ ఎన్‌కే రాహుల్ ఆర్ట్ విభాగాన్ని చూసుకుంటున్నారు. తిరుమలై రాజన్ ఆర్ ఎడిటింగ్. రాజేష్ కన్నన్ సంభాషణలు రాశారు. పీసీ స్టంట్స్. 

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే ఆడియో, ట్రైలర్, ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ విడుదలకు సంబంధించిన అప్డేట్స్ మేకర్స్ వెల్లడించనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.