నాగబంధం ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది – డైరెక్టర్ అభిషేక్ నామా

Nagabandham Will Surely Win the Audience’s Hearts says Abhishek Nama

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ విజువల్ వండర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. నిర్మాత సురేష్ బాబు ఈ వేడుకకు ముఖ్య అతిథి గా హాజరయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మీట్ లో దర్శకుడు అభిషేక్ నామా మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ఈ సినిమాను మా నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా చాలా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. వారు పెట్టిన డబ్బు పదిరెట్లు తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి కొత్త టాలెంట్‌ను ప్రేక్షకులు ప్రోత్సహించాలి. ఈ సినిమా సక్సెస్ అయితే ఇలాంటి మరెన్నో గొప్ప సినిమాలు వస్తాయి. అందరూ ఈ సినిమాను థియేటర్‌కు వచ్చి ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

నేను, మా డీవోపీ గారు, అలాగే ఆర్ట్ డైరెక్టర్ గారు అనంత పద్మనాభస్వామి వారి ఆలయానికి వెళ్లాము. అక్కడ ఫొటోలు తీసేందుకు అనుమతి లేదు. అందుకే మేము ఆ ఆలయాన్ని ప్రత్యక్షంగా చూసి, పేపర్‌పై స్కెచ్‌లు గీసుకుని, అదే ఆధారంగా ఆ సెట్‌ను నిర్మించాము. మన సంస్కృతి, మన మూలాలు, సనాతన ధర్మానికి సంబంధించిన ఒక గొప్ప సందేశం కూడా ఈ సినిమాలో ఉంటుంది. అది చాలా గొప్పగా వచ్చింది. ప్రేక్షకులు కచ్చితంగా ఒక అద్భుతమైన సినిమాను, గొప్ప అనుభూతిని ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.