మూడేళ్ల విరామం తర్వాత స్టార్ హీరోయిన్ సమంత చేసిన గ్రాండ్ కమ్‌బ్యాక్ మూవీ ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ ఎలిమెంట్స్‌తో నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో మంచి సినిమాలను, నటీనటులను ఎల్లప్పుడూ ప్రోత్సహించే మెగాస్టార్ చిరంజీవి, ఈ చిత్రబృందాన్ని ప్రత్యేకంగా హైదరాబాద్‌లోని తమ నివాసానికి ఆహ్వానించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సమంత, దర్శకురాలు నందిని రెడ్డి, రాజ్ నిడిమోరులను తమ ఇంటికి పిలిపించుకున్న చిరంజీవి-సురేఖ దంపతులు చిత్ర విజయంపై ప్రశంసలు కురిపించారు. సినిమా కథ, నందిని రెడ్డి టేకింగ్, సమంత నటన అద్భుతంగా ఉన్నాయంటూ మెగాస్టార్ కొనియాడారు. ఈ సందర్భంగా సమంతను చిరంజీవి దంపతులు ఎంతో ఆప్యాయంగా ప్రత్యేకంగా సత్కరించారు. తెలుగు సాంప్రదాయం ప్రకారం పట్టుచీర, తాంబూలంతో కూడిన ‘సారె’ను సమంతకు అందజేసి ఆశీర్వదించారు. దీనితో పాటు ఒక పవిత్రమైన పూజా శంఖాన్ని కూడా మెగాస్టార్ బహుమతిగా ఇచ్చారు.
సమంత వ్యక్తిగతంగా ఎన్నో ఆరోగ్య సమస్యలను (మైయోసైటిస్) ఎదుర్కొని, మళ్లీ ఎంతో బలంగా ఇండస్ట్రీలోకి రీ-ఎంట్రీ ఇచ్చి తన సొంత బ్యానర్ ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ పై ఈ రేంజ్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడంతో మెగాస్టార్ దంపతులు ఆమెను అభినందించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























