టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం తన సినీ ప్రయాణంలో సరికొత్త అడుగు వేశారు. వైవిధ్యమైన కథలతో నటుడిగా, రచయితగా ఇప్పటికే తన ప్రతిభను చాటుకున్న ఆయన, ఇప్పుడు ఏకంగా మెగాఫోన్ పట్టి దర్శకుడిగా అవతారమెత్తారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహించనున్న ఆయన 13వ చిత్రం ముహూర్తపు పూజా కార్యక్రమాలు హైదరాబాదులో ఘనంగా జరగడమే కాకుండా, వెంటనే మొదటి షెడ్యూల్ రెగ్యులర్ షూటింగ్‌ను కూడా అఫీషియల్‌గా ప్రారంభించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పరిశ్రమలోకి నటుడిగా అడుగుపెట్టకముందు షార్ట్ ఫిలిమ్స్ చేసిన అనుభవం ఉన్న కిరణ్ అబ్బవరం, గతంలో తన ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించి రైటర్‌గా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా పూర్తి స్థాయి బాధ్యతలను భుజాన వేసుకుని ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ నె్ట్టింట విపరీతంగా ఆకట్టుకుంటోంది. సంప్రదాయబద్ధమైన లుక్‌లో భారీ వంట పాత్రల ముందు నిలబడిన కిరణ్ అబ్బవరం రస్టిక్ బాడీ లాంగ్వేజ్‌తో ఉన్న ఈ పోస్టర్ చూస్తుంటే, కథ పల్లెటూరి సంస్కృతి మరియు బలమైన ఎమోషన్స్ చుట్టూ తిరగనుందని స్పష్టమవుతోంది.
ఈ భారీ వినూత్న ప్రాజెక్ట్‌ను ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ చాగంటి ‘జాయ్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ నిర్మాతగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా దేవిక భట్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా, సీనియర్ నటులు శరత్ కుమార్, సాయి కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం, విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























