పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యంత స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొంది, బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల వసూళ్లతో కెరీర్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘OG’ సీక్వెల్‌పై తాజాగా ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రం విడుదల సమయంలోనే ‘OG 2’ ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించినప్పటికీ.. పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉండటం, అలాగే దర్శకుడు సుజీత్ ఇతర ప్రాజెక్టులతో ముందుకు వెళ్తుండటంతో ఈ సినిమా ప్రస్తుతానికి ఆగిపోయిందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్‌కు చెందిన నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పవర్ఫుల్ పోస్ట్ ఈ రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టడమే కాకుండా, అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“మాట ఇచ్చినట్లే ఆయన చేస్తారు.. సమయం ఎప్పుడనేది ఆయనే చెబుతారు.. సుజీత్ విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత దీనిపై చర్చిద్దాం” అంటూ సదరు నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ అధికారిక ప్రకటనతో ‘OG 2’ ప్రాజెక్ట్ ఖచ్చితంగా పట్టాలెక్కుతుందని స్పష్టమైంది. ప్రస్తుతం దర్శకుడు సుజీత్ హీరో నానితో ఒక కొత్త సినిమాను ప్రకటించినప్పటికీ, ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే పవన్ కళ్యాణ్ తన రాజకీయ షెడ్యూల్‌కు అనుగుణంగా కేటాయించే డేట్స్‌ను బట్టి ఈ భారీ సీక్వెల్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ఇండస్ట్రీ వర్గాలు ప్లాన్ చేస్తున్నాయి.
ఇక ఈ సీక్వెల్ కథాంశం విషయానికి వస్తే, ఇది ఒక సాధారణ సీక్వెల్ లాగా కాకుండా ‘ప్రీక్వెల్’ (కథకు ముందు జరిగిన విషయాలు) గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి భాగంలో జపాన్ నుండి ముంబైకి వచ్చి అండర్‌వరల్డ్‌ను శాసించిన ఓజాస్ గంభీర గతం చుట్టూ ఈ కథ తిరగనుంది.త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























