ఓటీటీలోకి వచ్చేసిన వీరభద్రుడు

Veerabhadrudu Arrives on OTT

స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ ఆర్‌జే బాలాజీ కాంబినేషన్‌లో సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మాస్ అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కరుప్పు’. తెలుగులో ‘వీరభద్రుడు’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో విడుదలైన ఈ చిత్రం, థియేటర్లలో సూర్య ఊరమాస్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 300కోట్లకుపైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్‌ను అలరించేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి దిగిపోయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ బ్లాక్‌బస్టర్ మూవీ తెలుగు మరియు ఇతర భాషల్లో అధికారికంగా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ప్రభు ఎస్.ఆర్ ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా నిర్మించిన ఈ చిత్రంలో సూర్య నటన ఫ్యాన్స్‌కు పెద్ద ఐ-ఫీస్ట్‌గా నిలిచింది. కేవలం కామెడీ మాత్రమే కాకుండా ఈసారి సూర్య ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒక ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ సబ్జెక్ట్‌ను డైరెక్టర్ ఆర్‌జే బాలాజీ అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ఈ చిత్రంలో ఇంద్రన్స్, నట్టి నటరాజ్, స్వాసిక, శివదలతో పాటు టాలీవుడ్ నటుడు సుప్రీత్ రెడ్డి కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.

సాంకేతికంగా కూడా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ అవుట్‌పుట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డీఓపీ జి.కె. విష్ణు అందించిన డార్క్ అండ్ రస్టిక్ విజువల్స్, సాయి అభ్యంకర్ ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి యాక్షన్ సీన్‌ను థియేటర్లలో పీక్స్‌కు తీసుకెళ్లాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.