మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది . జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. తెలంగాణ లో ఈ సినిమాకు ఎలాంటి రేట్ల పెంపు దక్కకపోవడంతో నిరాశ చెందిన మేకర్స్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ భారీ బడ్జెట్ చిత్రం కోసం ప్రత్యేకంగా టికెట్ ధరల పెంపుతో పాటు, అదనపు షోలు మరియు అర్ధరాత్రి ప్రీమియర్ షోలకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేసింది.
జూన్ 4న సినిమా విడుదలైన రోజు నుండి మొదటి 10 రోజుల పాటు సాధారణ టికెట్ ధరలపై అదనంగా పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మల్టీప్లెక్స్‌లలో రూ. 125 (ప్లస్ జీఎస్టీ), అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 100 (ప్లస్ జీఎస్టీ) చొప్పున రేట్లను పెంచుకోవచ్చు.
జూన్ 4 నుంచి జూన్ 13 వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవడానికి అనుమతి లభించింది.జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటల నుంచే ఏపీలోని ఎంపిక చేసిన థియేటర్లలో ప్రత్యేక ప్రీమియర్ షోలు వేసుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. ఈ బెనిఫిట్/ప్రీమియర్ షో టికెట్ ధరను గరిష్టంగా రూ. 600 గా నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్‌లో లభించిన ఈ భారీ పెంపు మరియు 5 షోల అడ్వాంటేజ్‌తో రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం మొదటి రోజే రికార్డు వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఆల్రెడీ ఓవర్సీస్లో హాఫ్ మిలియన్ మార్క్ దాటేసిన ఈ చిత్రం.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వ సపోర్ట్‌తో తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి వసూళ్ల సునామీ సృష్టిస్తుందో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























