టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద అప్రతిహత విజయంతో దూసుకుపోతోంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో క్లీన్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. మొదటి రోజు రూ. 13.15 కోట్ల గ్రాస్‌తో అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా.. శని, ఆదివారాల్లో బాక్సాఫీస్‌ను పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన వివరాల ప్రకారం.. ఈ చిత్రం మొదటి 3 రోజుల్లో (ఫస్ట్ వీకెండ్) ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 43 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది.
లేడీ ఓరియెంటెడ్ సినిమాల చరిత్రలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వీకెండ్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు బ్రహ్మరథం పడుతుండటంతో నైజాం, ఆంధ్రా అనే తేడా లేకుండా అన్ని ఏరియాల్లోనూ హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. వీకెండ్ ముగిసినా వర్కింగ్ డేస్‌లో కూడా బుకింగ్స్ సాలిడ్‌గా ఉండటంతో రేపటి తో ఈసినిమా రూ. 50 కోట్ల మార్క్‌ను దాటేలా కనిపిస్తోంది.
అటు ఓవర్సీస్ లోనూ మా ఇంటి బంగారం జోరు కొనసాగిస్తోంది. నార్త్ అమెరికాలో నిన్నటి తో 1 మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫుల్ రన్ లో ఈసినిమా బయ్యర్లకు భారీ లాభాలను తీసుకురానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























