కోలీవుడ్ వర్సటైల్ హీరో కార్తీ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ అఫీషియల్ రిలీజ్ డేట్ ఖరారైంది. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ భారీ సీక్వెల్‌కు సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గతంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ స్పై థ్రిల్లర్ ‘సర్దార్’కు సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ‘సర్దార్ 2’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేస్తూ ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఏడాది వినాయక చవితి పండుగ వీకెండ్ కానుకగా సెప్టెంబర్ 10, 2026న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఫస్ట్ పార్ట్‌లో వాటర్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌ను చూపించిన డైరెక్టర్ పి.ఎస్. మిత్రన్.. ఈ పార్ట్ 2లో ఒక భారీ ఇంటర్నేషనల్ మిషన్‌ను చూపించబోతున్నట్లు హింట్ ఇచ్చారు. ఈ సినిమాలో కార్తీ సరికొత్త స్పై అవతారంలో కనిపించనుండగా, విలక్షణ నటుడు ఎస్.జె. సూర్య పవర్‌ఫుల్ విలన్ రోల్ పోషిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సామ్ సి.ఎస్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇస్తుండగా, జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























