తమిళంలో ఇటీవల రిలీజై సంచలన విజయం సాధించిన రీసెంట్ బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా ‘బ్లాస్ట్’ ఓటీటీ రిలీజ్ డేట్ అధికారికంగా ఖరారైంది. ఈ మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా జూన్ 25 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కానుంది. కేవలం తమిళంలోనే కాకుండా సౌత్ భాషలైన తెలుగు, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషలో కూడా ఒకేసారి ఈ చిత్రం డిజిటల్ స్క్రీన్‌పైకి రాబోతోంది.సస్పెన్స్, యాక్షన్ ఎంటర్టైనర్లను ఇష్టపడే సినీ ప్రియులకు వచ్చే వారం నెట్‌ఫ్లిక్స్‌లో పర్ఫెక్ట్ ట్రీట్ లభించనుంది.
ఈ భారీ ప్రాజెక్ట్‌లో యాక్షన్ కింగ్ అర్జున్, రాజారామ్ అనే కరాటే మాస్టర్ పాత్రలో తన మార్క్ యాక్షన్‌తో అలరించగా, ఆయన సరసన భార్య నీలవేణిగా సీనియర్ నటి అభిరామి నటించారు. ఇక వీరి కుమార్తె నీల పాత్రలో యువ నటి ప్రీతీ ముకుందన్ అద్భుతమైన కరాటే స్టంట్స్‌తో థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించింది. వీరితో పాటు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అబ్రహంగా అర్జున్ చిదంబరం విలనిజంతో ఆకట్టుకోగా, దిలీపన్, బాల హసన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి డెబ్యూటెంట్ డైరెక్టర్ సుభాష్ కె రాజ్ దర్శకత్వం వహించి స్క్రీన్‌ప్లేతో మాయ చేశారు.కేజీఎఫ్ సిరీస్ ఫేమ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ అందించిన పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ యాక్షన్ సీన్స్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్లింది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమా 70కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి నిర్మాతలకు భారీ లాభాలు తీసుకొచ్చింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























