మూడేళ్లుగా మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది.ఈరోజు క్లిన్ కారా మూడో పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్-ఉపాసన దంపతులు తమ ముద్దుల కూతురు ముఖాన్ని అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగాస్టార్ చిరంజీవి ముద్దుల మనవరాలు క్లిన్ కారా కొణిదెల పుట్టినరోజు వేడుకలు మెగా ఇంట్లో అంబరాన్ని తాకాయి. ఈ క్రేజీ అకేషన్లో మెగా ఫ్యాన్స్‌కు చరణ్ దంపతులు నెవర్ బిఫోర్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇప్పటివరకు సోషల్ మీడియా పోస్టుల్లో ఎప్పుడూ క్లిన్ కారా ముఖం కనిపించకుండా జాగ్రత్తపడిన ఈ స్టార్ కపుల్.. నేడు మొదటిసారి క్లిన్ కారా పూర్తి ముఖం కనిపించేలా ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ పిక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
తండ్రి రామ్ చరణ్ ఎత్తుకోగా, తల్లి ఉపాసన పక్కనే ఉండి చిరునవ్వులు చిందిస్తున్న ఈ ఫోటోలో క్లిన్ కారా క్యూట్ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తోంది. “ఎంత ముద్దుగా ఉందో.. అచ్చం చరణ్‌లాగే ఉందే”, “మెగా ప్రిన్సెస్ ఈజ్ హియర్” అంటూ నెటిజన్లు, ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. లలితా సహస్రనామం నుండి సేకరించిన ‘క్లిన్ కారా’ అనే పేరుకు ప్రకృతి స్వరూపమని అర్థం. ఈ ఏడాది జనవరిలోనే చరణ్-ఉపాసన దంపతులకు కవల పిల్లలు (శివరామ్, అన్వీరా దేవి) జన్మించగా, ఇప్పుడు పెద్దకూతురు క్లిన్ కారా బర్త్‌డే వేడుకలను మెగా ఫ్యామిలీ ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో #KlinKaara హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























