హర్ష రోషన్ మరియు శ్రీదేవి అపల్లా జంటగా నటించిన’బ్యాండ్ మేళం’ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘కోర్ట్’ తరువాత హార్ష్ రోషన్ , శ్రీదేవి కలిసి నటించడం ఇది రెండోసారి.ఈ చిత్రం గత నెలలో థియేటర్లలోకి వచ్చి డీసెంట్ హిట్ అనిపించుకుంది. ఇక ఈరోజు నుండి జీ 5లో అందుబాటులోకి వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రానికి సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించగా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై కోన వెంకట్ సమర్పణలో కావ్య కోన, శ్రావ్య కోన నిర్మించారు. విజయ్ బల్గానిన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.
ఇందులో కీలక పాత్రలో సీనియర్ నటుడు సాయి కుమార్ మెప్పించారు. వీరితో పాటు గోపరాజు విజయ్, లక్ష్మణ్ మరియు ఇతర నటీనటులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. చిన్ననాటి స్నేహితుల మధ్య సాగే ప్రేమ, కుటుంబ గౌరవం మరియు సంగీతం చుట్టూ తిరిగే ఈ వినోదాత్మక చిత్రం ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























