కార్తికేయ-2తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుడు చందూ మొండేటి, ఇప్పుడు రానా దగ్గుబాటి మరియు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌లతో కలిసి ఒక భారీ హిస్టారికల్ థ్రిల్లర్‌ను ప్లాన్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారతీయ చరిత్రలోని ఒక కీలకమైన ఘట్టం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. సుమారు 18వ శతాబ్దపు నేపథ్యంతో సాగే ఈ కథలో రానా ఒక పవర్‌ఫుల్ యోధుడిగా కనిపించనున్నారు. అక్షయ్ కుమార్ ఒక అత్యంత కీలకమైన మరియు శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. వీరిద్దరితో పాటు మరో స్టార్ యాక్టర్ కూడా ఇందులో నటించే అవకాశం వుంది.
బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాడు. చారిత్రక వాతావరణాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించేందుకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులను, ముఖ్యంగా హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ టీమ్‌ను రంగంలోకి దించుతున్నారు. ‘కార్తికేయ-2’తో అడ్వెంచర్ థ్రిల్లర్లను డీల్ చేయడంలో తన సత్తా చాటిన చందు మొండేటి, ఈసారి చారిత్రక అంశాలకు తనదైన శైలిలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను జోడించబోతున్నారు.
ఈ సినిమా పాన్-ఇండియా స్థాయిలో తెలుగు, హిందీతో పాటు అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. త్వరలోనే ఈసినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























