జనసేన ఆఫీసులో పవన్‌ను కలిసిన రామ్ చరణ్

నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేదికగా బుధవారం సాయంత్రం ఒక అపురూపమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రామ్ చరణ్ ఆయనను అధికారికంగా కలవడం ఇదే తొలిసారి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోన్న ‘ఆంధ్ర ప్రీమియర్ లీగ్’ (APL) సీజన్-5 ముగింపు దశ మ్యాచ్‌ల వేడుకలకు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి వెళ్లే దారిలోనే ఆయన నేరుగా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకుని బాబాయ్‌ పవన్ కళ్యాణ్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. ఆఫీస్‌కు వచ్చిన చరణ్‌ను చూసి పవన్ కళ్యాణ్ ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలికారు. చరణ్‌ను శాలువాతో సత్కరించి, ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా వీరిద్దరూ కొంతసేపు ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. కుటుంబ విషయాలతో పాటు సినీ ప్రాజెక్టులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కేవలం రెండు వారాల్లోనే 400 కోట్ల క్లబ్‌లోకి చేరి సంచలన విజయం సాధించడంతో.. బాబాయ్ పవన్ కళ్యాణ్ అబ్బాయి చరణ్‌ను ప్రత్యేకంగా అభినందించినట్లు తెలుస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.