అమరావతిలో అట్టహాసంగా ప్రారంభమైన బాలకృష్ణ-కొరటాల శివ NBK 112

Balakrishna–Koratala Siva’s NBK112 Launched Grandly in Amaravati

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో మరో క్రేజీ మైల్‌స్టోన్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. బ్లాక్‌బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న 112వ చిత్రం (#NBK112) గురువారం అమరావతి, వెంకటపాలెంలోని బిట్స్ పిలానీ గ్రౌండ్స్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయింది. రాజధాని అమరావతిలో ఒక భారీ సినిమా ఓపెనింగ్ జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ప్రతిష్టాత్మక ముహూర్తపు వేడుకకు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మామ బాలకృష్ణ చిత్రానికి అల్లుడు నారా లోకేష్ తొలి క్లాప్ కొట్టగా.. మంత్రి కందుల దుర్గేష్ కెమెరా స్విచ్ఛాన్ చేసి ముహూర్తపు షాట్‌కు యాక్షన్ చెప్పారు. బాలయ్య-కొరటాల శివ కాంబోలో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ వేడుకకు నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో అమరావతి పరిసర ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాతలు సుధాకర్ చెరుకూరి (SLV సినిమాస్), సుధాకర్ మిక్కిలినేని (యువసుధ ఆర్ట్స్) సంయుక్తంగా దాదాపు రూ. 150 నుండి రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్‌లో నిర్మిస్తున్నారు. కొరటాల శివ మార్క్ పవర్‌ఫుల్ సోషల్ మెసేజ్, బాలయ్య మార్క్ ఊరమాస్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా కథాంశం ఉండబోతోంది. ఈ ఏడాది ఆగస్టు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2027 సమ్మర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.