ఎన్టీఆర్-నీల్.. నేటినుండి నైట్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం

NTR-Neel Night Shooting Schedule Starts From Today With Key Sequences

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం నుంచి అభిమానులకు క్రేజీ అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాను ప్రచార పరంగా ‘ఎన్టీఆర్–నీల్’ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తుండగా, చిత్రానికి ‘డ్రాగన్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే పలు కీలక షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకున్న ఈ భారీ ప్రాజెక్ట్, నేటి నుంచి మరో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ షెడ్యూల్ సుమారు 22 రోజుల పాటు కొనసాగనుండగా, ప్రత్యేకంగా నైట్ షూటింగ్ కోసం ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇక ఈ నైట్ షూటింగ్‌లో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలతోపాటు ఎన్టీఆర్‌పై కొన్ని భావోద్వేగ సన్నివేశాలను చిత్రీకరించే అవకాశం ఉంది. అయితే, ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌తో పాటు ఇతర ముఖ్య నటీనటులు కూడా పాల్గొంటారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్, ఇంటెన్స్ సీన్స్ ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారని టాక్ వినిపిస్తోంది.

భారీ బడ్జెట్‌తో, అత్యాధునిక టెక్నికల్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఇండియన్ సినీ పరిశ్రమలోనే ఒక సంచలనంగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని అధికారిక అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా దీనిపై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సతీమణి లిఖితారెడ్డి దీనిని ధృవీకరిస్తూ, సోషల్ మీడియా వేదికగా నిన్నే ఒక పోస్ట్ పెట్టారు. అందులో.. “పాపకు నాన్న షూటింగ్‌కి వెళ్లాల్సి వస్తే చాలా బాధగా ఉంటుంది. ముందుగా నాన్న షూస్ వేసుకుని ఇవ్వకుండా మొండిగా పట్టుకుంటుంది, తర్వాత తలుపు అడ్డంగా నిలబడి వెళ్లనీయదు, ఆ తర్వాతే ఆ కష్టమైన గుడ్‌బై క్షణం వస్తుంది.” అని తెలిపారు.

ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో పూర్తి కొత్త లుక్‌లో, ఆసక్తికరమైన పాత్రలో కనిపించబోతున్నారని యూనిట్ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. అలాగే, ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనలు, పూర్తి టైటిల్, ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.