నందమూరి బాలకృష్ణ నటించిన భారీ యాక్షన్ ఎపిక్ ‘అఖండ 2’ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. సినిమా విడుదలైన తొలి రోజు మరియు ప్రీమియర్ షోల కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ అద్భుతమైన వసూళ్లతో ‘అఖండ 2’ బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యంత భారీ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారీ యాక్షన్ సన్నివేశాలు, ఆధ్యాత్మిక నేపథ్యం, బాలకృష్ణ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే థియేటర్లలో ఫ్యాన్స్ సందడి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లలో కూడా ఈ చిత్రానికి బలమైన స్పందన లభిస్తోంది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించగా, థమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరింత బలం చేకూర్చింది. ప్రస్తుతం సినిమా 3D ఫార్మాట్‌లో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. బ్లాక్‌బస్టర్ టాక్‌తో ముందుకుసాగుతున్న ‘అఖండ 2’ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సృష్టించనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























