ది ప్యారడైజ్ సినిమాకు ప్రత్యామ్నాయ టైటిల్ సమ్మక్క – నాని

Nani Reveals Sammakka Was Considered as an Alternative Title for The Paradise

నాని కథానాయకుడిగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’.సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ప్రస్తుతం జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా టైటిల్ పై నాని చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాకి ‘ది ప్యారడైజ్’ కాకుండా మరో ప్రత్యామ్నాయ టైటిల్ పెట్టాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా ‘సమ్మక్క’ అని పెడితేనే పర్ఫెక్ట్‌గా సరిపోతుందని నాని వ్యాఖ్యానించారు.

ఇక ఈ చిత్రంలో నాని తల్లి పాత్ర పేరు సమ్మక్క అని, కథలో ఆ పాత్ర ఎంతో కీలకంగా ఉండబోతోందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘దసరా’ వంటి భారీ హిట్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. సెన్సార్ బోర్డు నుంచి ‘ఎ’ (A) సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం 169 నిమిషాల నిడివితో థియేటర్లలో సందడి చేయనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.