భారతరత్న, ప్రముఖ కర్ణాటక సంగీత దిగ్గజం ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్‌లో నటించే అరుదైన అవకాశం నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు లభించింది. ‘మళ్ళీ రావా’, ‘జెర్సీ’ వంటి ఎమోషనల్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా గ్లామరస్, కమర్షియల్ పాత్రల్లో కనిపించిన రష్మిక, తన కెరీర్‌లోనే మొదటిసారి ఒక ఐకానిక్ క్లాసికల్ రోల్‌లో నటించబోతుండటం సినీ వర్గాల్లో విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది.ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ , రాక్ లైన్ వెంకటేష్ ఈసినిమాను నిర్మించనున్నారు
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎం.ఎస్. సుబ్బలక్ష్మి 110వ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 16, 2026న చెన్నైలో ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేశారు. ఈ గ్రాండ్ లాంచ్ వేడుకకు లోకనాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపనున్నారు. అంతేకాకుండా, ఈ సంగీత ప్రాధాన్యమున్న బయోపిక్‌కు తమిళ సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తుండటం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
ఈ సినిమాలో ఎం.ఎస్. సుబ్బలక్ష్మి జీవితంలోని వివిధ దశలను, ఆమె సంగీత ప్రస్థానాన్ని ఎంతో సహజంగా ఆవిష్కరించబోతున్నారు. ఈ క్లాసికల్ రోల్ కోసం రష్మిక ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవడంతో పాటు మేక్‌ఓవర్ కూడా కానున్నారు. పాన్-ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రష్మిక నటనకు సరైన పరీక్షగా నిలవడమే కాకుండా, ఆమె కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























