న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చెన్నై ప్రెస్ మీట్‌లో న్యాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘ది ప్యారడైజ్ 24న రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు థియేటర్ లో మంచి మాస్ ఫిలిమ్‌ని చూడాలనుకుంటారు. అలాంటి గొప్ప మాస్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ‘ప్యారడైజ్’. ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో సెప్టెంబర్ 24న చూస్తారు. మేము ఒక మంచి కథని చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో, గొప్ప మూమెంట్స్‌తో తీశాము. నేను కమల్ హాసన్ గారు, భాగ్యరాజా గారు, భారతీరాజా గారి సినిమాలు చూస్తూ పెరిగాను. చెన్నై ఎప్పుడు వచ్చినా సరే ఒక ఇంటికి వచ్చినట్టు ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ ప్రేక్షకులు నన్ను ఎంతో చక్కగా ఆదరించారు. ఈ సినిమా తమిళ్ డబ్బింగ్ క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే అంత కాన్ఫిడెంట్‌గా ఇక్కడ ప్రమోట్ చేస్తున్నాను. నా గత సినిమాలకు ఇక్కడ అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారు. తమిళ ఆడియన్స్ కు కృతజ్ఞతతో ఉంటాను. నా కెరీర్‌లో చేసిన చాలా హార్డ్ వర్కింగ్ సినిమా ఇది. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. కచ్చితంగా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది. ఇది థియేటర్‌లో చాలా క్రేజీ రైడ్‌లాగా ఉండబోతుంది. ఇప్పుడు అందరూ నన్ను నాని అని పిలుస్తారు. మళ్లీ ఇక్కడికి ప్రెస్ మీట్‌కి వచ్చినప్పుడు మీరు తప్పకుండా జడల్ అనే పేరుతో పిలుస్తారు.
ఈ సినిమాని తమిళ్‌లో రిలీజ్ చేస్తున్న స్వరూప్ గారికి థాంక్యూ. తప్పకుండా ఇది ఆయనకి చాలా మంచి జ్ఞాపకం అవుతుంది. అనిరుధ్, నా కాంబినేషన్ చాలా స్పెషల్. మా ఇద్దరం కలిసి చేసిన ‘జెర్సీ’ నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిలిం. అలాగే ‘గ్యాంగ్ లీడర్’ సినిమా చాలామందికి ఫేవరెట్. అందులో అనిరుధ్ మ్యూజిక్ బ్లాక్‌బస్టర్. ఇప్పుడు ‘ప్యారడైజ్’లో ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ బ్లాక్‌బస్టర్ అయ్యాయి. మా కాంబినేషన్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ‘ప్యారడైజ్’ కూడా అద్భుతమైన సినిమాగా ఉండబోతుంది. కీర్తి ఈ సినిమాలో స్పెషల్ కెమియో చేసింది. మేము చేసిన పాట ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారింది. ప్రతి ఒక్కరూ సాంగ్ ఎంజాయ్ చేస్తున్నారు.థియేటర్‌లో మరింత ఎంజాయ్ చేస్తారు. నిజంగా జడల్‌తో షూటింగ్ చేయడం చాలా కష్టం. ఈ సందర్భంగా మహిళలందరికీ హ్యాట్సాఫ్ చెబుతున్నాను. షూటింగ్ డేస్ లో చాలా కష్టంగా అనిపించింది . కానీ మహిళలు జీవితాంతం ఆ జడలతో ఉంటారు. నిజంగా వారికి హ్యాట్సాఫ్ చెబుతున్నాను. ఈ జడల లుక్, అపీరియన్స్ ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా నుంచి ఏ కంటెంట్ వచ్చినా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇందులో కయాదు సుబ్బు పాత్రలో చేసింది. ఆ పాత్రకి 100% న్యాయం చేసింది. తమిళ్ కథలు వస్తే తప్పకుండా తమిళ్‌లో కూడా సినిమాలు నిర్మించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























