బెల్లా బెల్లా సాంగ్ కి సూపర్ రెస్పాన్స్

Bella Bella’ First Single from Bhartha Mahasayulaku wignyapthi Gets an Excellent Response

మాస్ మహారాజా రవితేజ,’నేను శైలజ’ ఫేమ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది.రీసెంట్ గా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బెల్లా బెల్లా అంటూ సాగే ఈ మాస్ డ్యూయెట్ సాంగ్ విడుదలైన దగ్గరి నుండి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటూ చార్ట్ బస్టర్ అనిపించుకుంది.ఇప్పటివరకు ఈసాంగ్ యూట్యూబ్ లో 7కు పైగా మిలియన్ల వ్యూస్ ను రాబట్టుకుంది.రీల్స్ లోనూ  తెగ  తిరుగుతుంది ఈ సాంగ్. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం, ఆకాష్ నజీజ్, రోహిణి సోరట్ గానం ఆకట్టుకోగా, పాటలోని విజువల్స్ క్వాలిటీ మాత్రం అదిరిపోయింది. ముఖ్యంగా, హీరో రవితేజ, హీరోయిన్ల డ్యాన్స్ మరియు విదేశీ లొకేషన్లలో చిత్రీకరించిన విధానం ఈ పాటకే హైలైట్‌గా నిలిచాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు.

ఇక రవితేజ ఈసారి తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి, ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్‌గా చేసుకుని ఫ్రెష్ కంటెంట్‌తో వస్తుండడం విశేషం. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తుండగా సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు .మొదటి పాటే ఈ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకోవడంతో, సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.