హీరో ఆది సాయి కుమార్ నెక్స్ట్ మిస్టికల్ థ్రిల్లర్ శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్ తో రానున్నాడు.షూటింగ్ పూర్తి చేసుకున్న విడుదలకు సిద్దమవుతుంది.రీసెంట్ గా విడుదలైన ఈసినిమా ట్రైలర్ అంచనాలను పెంచేసింది.దాంతో సినిమా బిజినెస్ కూడా బాగా జరుగుతుంది.అందులో భాగంగా థియేట్రికల్ రైట్స్ 10 కోట్లకు అమ్ముడయ్యాని సమాచారం.ఇక నైజాంలో ఈసినిమాను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ విడుదలచేస్తుండడంతో అధిక సంఖ్యలో థియేటర్లు దొరకనున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యుగంధర్ ముని ఈసినిమాను డైరెక్ట్ చేయగా శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.రాజశేఖర్ అన్న భిమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో అర్చన అయ్యర్ హీరోయిన్ గా నటించగా స్వశిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ కీలక పాత్రల్లో నటించారు. విజువల్ వండర్‌గా, అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేందుకు ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఆడియెన్స్ ముందుకు రానుంది.
ఇక ఈసినిమాపై ఆది సాయి కుమార్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. గత కొన్నేళ్ల నుండి ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న తనకు శంబాలా ఆ విజయాన్ని అందిస్తుందని కాన్ఫిడెంట్ గా వున్నాడు. సినిమాను కూడా గట్టిగానే ప్రమోట్ చేస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























