రీసెంట్ గా కింగ్డమ్ తో వచ్చి ఎట్టకేలకు డీసెంట్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఇక ఈసినిమా తరువాత విజయ్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న VD 14 ( వర్కింగ్ టైటిల్) ఒకటి. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో టాక్సీవాలా రాగ సూపర్ హిట్ అనిపించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈ కాంబో మరో సారి రిపీట్అవుతుంది .అయితే ఈసారి పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో భారీ ఎంటర్టైనర్ ను ప్లాన్ చేశారు.రీసెంట్ గా షూటింగ్ కూడా స్టార్ట్ కాగా నిన్నటి తో కీలకమైన షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు. ఈ సందర్భంగా ఆన్ లొకేషన్ స్టిల్ ను రిలీజ్ చేశాడు డైరెక్టర్. అలాగే త్వరలోనే ఈసినిమానుండి అప్డేట్ వస్తుందని కూడా తెలిపారు. ఫస్ట్ లుక్ తోపాటు టైటిల్ ను ప్రకటించే ఛాన్స్ వుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.
ఇక ఈసినిమా తోపాటు విజయ్ ,రవి కిరణ్ కోలా డైరెక్షన్ లో ఓ సినిమా కూడా చేస్తున్నాడు.దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తుండగా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో రానుంది.రీసెంట్ గానే ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది.ఇందులో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా నటిస్తుంది.వచ్చే ఏడాది ద్వితీయార్థంలో పాన్ ఇండియా భాషల్లో విడుదలకానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























