మెగాస్టార్ చిరంజీవి నుండి వస్తున్న నెక్స్ట్ మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఫ్యాన్స్ కి బిగ్గెస్ట్ ట్రీట్ కానుంది.అందులో భాగంగా విక్టరీ వెంకటేష్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టు పెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మన శంకర వర ప్రసాద్ గారు సినిమా కోసం నా పాత్రకు సంబంధించిన షూట్ ఈరోజుతో పూర్తయ్యింది. ఇది ఎంతో అద్భుతమైన అనుభవం! నాకు ఎంతో ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి’ గారితో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎంతోకాలంగా ఎదురుచూశాను. ఆ అవకాశాన్ని ఈ ప్రత్యేకమైన సినిమాతో ఇచ్చినందుకు డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు .మనం అందరం కలిసి 2026 సంక్రాంతిని థియేటర్స్‌లో ఘనంగా సెలబ్రేట్ చేద్దాం అని ఎక్స్ లో పోస్ట్ చేయగా దీనికి మెగాస్టార్ చిరంజీవి రిప్లయ్ ఇస్తూ ఒక ప్రత్యేకమైన పోస్ట్ పెట్టారు.
మై డియర్ వెంకీ… మై బ్రదర్ మనమిద్దరం కలిసి పనిచేసిన ఈ పది రోజులు నాకు మెమరబుల్. నీతో గడిపిన ప్రతి క్షణం ఆనందంతో, ఎనర్జీతో నిండిపోయింది. ‘మన శంకరవర ప్రసాద్ గారు’ చిత్రానికి నువ్వు ఇచ్చిన ప్రత్యేకమైన ప్రజెన్స్ అబ్బురపరిచింది. నీతో గడిపిన ప్రతి క్షణం ఎంతో ఆనందం కలిగించింది.
ఇక విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి పోస్టులుని కోట్ చేస్తూ తన ఆనందాన్ని తెలియజేస్తూ డైరెక్టర్ అనిల్ రావిపూడి పోస్ట్ పెట్టారు.కొన్ని కలలు మన మనసులో సంవత్సరాల పాటు దాగి ఉంటాయి. అకస్మాత్తుగా సినిమా అలాంటి కలలను నిజం చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారితో పక్కపక్కన నిలబడి, కలిసి నవ్వుతూ, డ్యాన్స్ చేస్తూ, వారి ప్రత్యేకమైన చార్మ్‌తో మెరిసిన ఆ క్షణం…నిజంగా మాటల్లో చెప్పలేనంత ఆనందం ఇచ్చింది. నా ప్రయాణంలో ఇది ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.మన శంకర వర ప్రసాద్ గారు కోసం తన పార్ట్ ని పూర్తిచేసి, ఈ అందమైన కలను సాకారం చేసిన డియర్ వెంకీ సర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు.2026 సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా ప్రేక్షకులు ముందుకు రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























