12 ఏళ్ళ క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్ సృష్టించింది మలయాళ సినిమా దృశ్యం.సూపర్ స్టార్ మోహన్ లాల్ ,దర్శకుడు జీతూ జోసఫ్ కాంబినేషన్ లో వచ్చిన ఈసినిమా క్రైం థ్రిల్లర్ డ్రామాల్లో బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసింది.ఆ తరువాత దృశ్యం తెలుగు , హిందీల్లో రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ తరువాత ఈసినిమాకు సీక్వెల్ గా వచ్చిన దృశ్యం 2 కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.అయితే కోవిడ్ వల్ల ఈసినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వలేదు.ఇక ఈ సిరీస్ లో థర్డ్ పార్ట్ కూడా రానుందని తెలిసిందే.అయితే అప్పుడే దృశ్యం 3 షూట్ కూడా కంప్లీట్ అయిపొయింది.నిన్నటితో ఈసినిమా షూటింగ్ పూర్తయిందని మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు. కేవలం రెండు నెలల్లోనే షూట్ కంప్లీట్ చేశారు. మలయాళ వెర్షన్ లో మోహన్ లాల్ హీరోగా నటించగా తెలుగు వెర్షన్ లో వెంకటేష్ ,హిందీలో అజయ్ దేవగన్ నటించనున్నారు.
మలయాళ వెర్షన్ ను జీతూ జోసఫ్ డైరెక్ట్ చేస్తుండగా ఆంటోనీ పెరంబవుర్ నిర్మిస్తున్నారు.ఇక మలయాళ వెర్షన్ చిత్రీకరణ పూర్తి కావడంతో త్వరలోనే తెలుగు వెర్షన్ షూట్ స్టార్ట్ కానుంది..వచ్చే ఏడాది మూడు భాషల్లో ఒకేసారి దృశ్యం 3 ని రిలీజ్ చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























