అరసన్ లోకి విజయ్ సేతుపతి

Vijay Sethupathi on board for ARASAN

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్, కోలీవుడ్ స్టార్ హీరో శింబు కాంబినేషన్‌లో ‘అరసన్’ అనే ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఈ హై-బడ్జెట్ ప్రాజెక్ట్ గతంలో వచ్చిన గ్యాంగ్‌స్టర్ డ్రామా వడ చెన్నై ప్రపంచంలో భాగంగా రూపొందుతుండటం విశేషం.తెలుగులో ఈ సినిమాను సామ్రాజ్యం పేరుతో తీసుకురానున్నారు మేకర్స్. ఇక ఈసినిమాలో కీలక పాత్ర కోసం ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతిని తీసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అరసన్ అంటే తెలుగులో రాజు  అని అర్థం. ఈ చిత్రం కూడా వెట్రిమారన్ మార్క్ గ్రామీణ నేపథ్యంలో, ఉత్తర చెన్నైలోని ముఠా పోరాటాల కథాంశంతో వాస్తవికతకు దగ్గరగా రూపొందనుంది.అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండడం మరింత ఆసక్తికరం.ఈసినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ప్రముఖ నిర్మాణ సంస్థ V క్రియేషన్స్ బ్యానర్ పై అగ్ర నిర్మాత కలైపులి ఎస్ థాను భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తమిళ చిత్ర పరిశ్రమలో మరో సంచలనం సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.