మాస్ జాతర సూపర్ డూపర్ సాంగ్ రిలీజ్

Super Duper Song from mass jathara out now

మిస్టర్ బచ్చన్ తరువాత మాస్ మహా రాజా రవితేజ నెక్స్ట్ మాస్ జాతరతో వస్తున్నాడు.నిజానికి ఎప్పుడో విడుదలకావాల్సిన ఈసినిమా పలు సార్లు వాయిదా పడి ఎట్టకేలకు థియేటర్లలోకి రానుంది.రవితేజ కు ఇది 75వ సినిమా.సూపర్ హిట్ మూవీ సామజవరగమన సినిమాకు రైటర్ గా పనిచేసిన భాను భోగవరపు మాస్ జాతరతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి వచ్చిన మూడు పాటలు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా ఈరోజు నాలుగో పాటను రిలీజ్ చేశారు.సూపర్ డూపర్ అంటూ డాన్స్ నెంబర్ గా వచ్చిన ఈసాంగ్ కూడా అదిరిపోయింది. ఇందులో హీరోహీరోయిన్ల ఎనర్జిటిక్ డ్యాన్స్ హైలైట్ అవ్వనుంది.సంక్రాంతికి వస్తున్నాం సినిమా లాగే మాస్ జాతరకి కూడా సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో.ఈ వారంలో ట్రైలర్ కూడా రానుంది.

ఈసినిమాలో రవితేజ రైల్వే పోలీస్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించనుండగా తనకు జంటగా శ్రీలీల నటించింది. వీరిద్దరికి ఇది రెండో సినిమా.ఇంతకుముందు వీరి కాంబో లో ధమాకా రాగ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. మాస్ జాతర ను నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.ఈనెల 31న థియేటర్లలోకి వస్తుంది. ఇక ఈసినిమాతో హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు రవితేజ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.