వీక్ డేస్ లో కూడా ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ అదరగొడుతుంది.ఈనెల 17న విడుదలైన ఈసినిమా పాజిటివ్ మౌత్ టాక్ తో 100 కోట్ల క్లబ్ కి చేరువైంది. స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగిస్తూ 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి 95 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుందని మేకర్స్ ప్రకటించారు. ఈరోజుతో 100కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇవ్వనుంది.ప్రదీప్ కు వరుసగా ఇది మూడో 100 కోట్ల సినిమా కానుంది.ఈ వీకెండ్ కల్లా డ్యూడ్ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అటు ఓవర్సీస్ లోకూడా ఈసినిమా అదరగొడుతుంది.నార్త్ అమెరికా లో 5 రోజుల్లో 700K డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది. ఇక ఈసినిమాతో ప్రదీప్ హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.కెరీర్ లో ఇప్పటివరకు అటు డైరెక్టర్ గా ఇటు హీరోగా అపజయమే లేకుండా దూసుకుపోతున్నాడు ప్రదీప్.
డ్యూడ్ ను కొత్త డైరెక్టర్ కీర్తిశ్వరన్ డైరెక్ట్ చేయగా ప్రేమలు ఫేమ్ మమితా బైజు కథానాయికగా నటించింది.యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందించాడు.టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మించింది.
ఇక నెక్స్ట్ ప్రదీప్ ఎల్ఐకె తో రానున్నాడు.విగ్నేష్ శివన్ డైరెక్షన్ లో తెరక్కుతున్న సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.డిసెంబర్ 18న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























