RT 76 స్పెయిన్ షెడ్యూల్ కంప్లీట్

RT 76 Wraps Up Spain Schedule

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తన 76వ సినిమా చేస్తున్నాడు.సుధాకర్ చెరుకూరి ఈసినిమాను నిర్మిస్తుండగా ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది.నిన్నటితో ఈసినిమా స్పెయిన్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.ఇందులో కొన్ని కీలక సన్నివేశాలతోపాటు ఓ సాంగ్ ను చిత్రీకరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ షెడ్యూల్ తో సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ కానుంది.త్వరలోనే టైటిల్ రివీల్ చేయనున్నారు.సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అయితే అదే టైంకి టాలీవుడ్ నుండి మరో 4 సినిమాలు వస్తుండడం తో RT 76 కి బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదురుకానుంది.

ఇక రవితేజ నెక్స్ట్ మాస్ జాతర తో ప్రేక్షకులముందుకు వస్తున్నాడు.ఈనెల 31న ఈసినిమా థియేటర్లలోకి రానుంది. RT 76 స్పెయిన్ షెడ్యూల్ ముగించుకొని ఇండియా వచ్చేసిన రవితేజ మాస్ జాతర ప్రమోషన్స్ లో బిజీ కానున్నాడు. ఇది తనకు 75వ సినిమా.కొత్త దర్శకుడు భాను భోగవరపు ఈసినిమాను డైరెక్ట్ చేయగా శ్రీ లీల హీరోయిన్ గా నటించింది.ఇందులో రవితేజ రైల్వే పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.