హీరో విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ విజయం తర్వాత మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్ ‘భద్రకాళి’తో వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కనెక్ట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాతో కలిసి ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ రిలీజ్ చేస్తోంది. ‘భద్రకాళి’ సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. భద్రకాళి సినిమాతో మీ అందరి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. అరుణ్ ప్రభు గారు లాంటి డైరెక్టర్‌తో వర్క్ చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. పదేళ్ల క్రితమే ఆయన తీసిన ‘అరువి’ సినిమా చూశాను .అద్భుతమైన సినిమా. నా అభిప్రాయం ప్రకారం ఇండియాలో టాప్ టెన్ డైరెక్టర్స్‌లో ఆయన ఒకరు.”
“చాలా టాలెంటెడ్ పర్సన్. ఈ సినిమాతో పాన్ ఇండియాకు ఆయన విజన్ రీచ్ అవుతుంది. కచ్చితంగా ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది. నిర్మాత రామ్ గారు నాకు మంచి స్నేహితులు. వారితో కలిసి మరిన్ని సినిమాలు చేయాలని భావిస్తున్నాం. రచయిత భాష శ్రీ గారు తెలుగుకి సంబంధించి అన్ని బాధ్యతలు తీసుకున్నారు. చాలా అద్భుతమైన మాటలు రాశారు.”
“హీరోయిన్స్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన సపోర్ట్ వల్లే ఆంధ్ర, తెలంగాణలో ఇంత గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. కచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు.” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























