యువ హీరో నితిన్ నటిస్తున్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ అప్డేట్ వచ్చేసింది. “ఈ డిసెంబర్లో కృష్ణుడి ప్రేమకు ఒక కథ ఉంది” అనే క్యాచీ టాగ్ లైన్‌తో ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రాన్ని నేచురల్ స్టార్ నాని సమర్పణలో, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి గంటా నిర్మిస్తుండగా.. ‘దండోరా’ ఫేమ్ మురళి కాంత్ దేవోత్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇందులో నితిన్ ‘కృష్ణ’ అనే ఆసక్తికరమైన పాత్రలో కనిపించనున్నారు. అయితే టైటిల్లో ఉన్న ‘రుక్మిణి’ పాత్రలో ఏ కథానాయిక నటిస్తోంది? ఆ క్యారెక్టర్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? అనే వివరాలను అక్టోబర్ 13న అధికారికంగా వెల్లడించనున్నారు. నితిన్-నాని కాంబినేషన్లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్తోనే టాలీవుడ్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.ఈసినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























