‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ శ్రీ విష్ణు నవ్వుల బ్లాక్‌బస్టర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’. జానకి రామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పించగా, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించారు. మహిమా నంబియార్ కథానాయికగా నటించారు. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.ఇది ఒక మాస్ కామెడీ సినిమా. ఇప్పటివరకు నేను లవ్ కామెడీ ఎంటర్టైనర్స్ లాంటి జోనర్స్ చేశాను. మొదటిసారి ఈ జానర్‌ను ఎంచుకోవడంతో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని అనుకునేవాడిని. కానీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కోన గారు ఈ కథ చెప్పినప్పుడే ఇది ఒక మంచి మాస్ ఎంటర్టైనర్ అవుతుందని అనుకున్నాం. మా నమ్మకం నిజమైంది. అందరూ నన్ను ‘కామ్రేడ్’ అంటున్నారు. కానీ ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ నిజమైన కామ్రేడ్లే. ఇది పక్కా దసరా పండుగ సినిమా.
థియేటర్లలో జరిగే సెలబ్రేషన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఈ సినిమాలో నవ్వులే నవ్వులు. ప్రేక్షకులు థియేటర్లలో ఈ సినిమాను ఒక నవ్వుల పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ దసరాకు కుటుంబ సభ్యులందరూ కలిసి థియేటర్లలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకునే సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























