మాస్ మహారాజా రవితేజ బ్రదర్ యాక్టర్ రఘు కుమారుడు మాధవ్ హీరోగా రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా మారెమ్మ.ఈసినిమాతో మాధవ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.ఈసినిమాకు మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈరోజు మాధవ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ సినిమా నుండి స్పెషల్ పోస్టర్, గ్లింప్స్ ని రిలీజ్ చేశారు.పోస్టర్ లో మాధవ్ ఇంటెన్స్,రగ్గడ్ లుక్ లో ఆకట్టుకున్నారు.మాధవ్ కబడ్డీ కోర్ట్ లో అడుగుపెడుతున్నట్లుగా ప్రజెంట్ చేసిన గ్లింప్స్ పవర్ ఫుల్ గా వుంది.తనని ఫెరోషియస్ గా ప్రజెంట్ చేసిన తీరు అదిరిపోయింది.విజువల్స్, బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ టాప్ నాచ్ వున్నాయి.
ఈ చిత్రంలో మాధవ్ సరసన దీపా బాలు కథానాయిక గా నటిస్తోంది. వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, వి.ఎస్.రూప లక్ష్మి ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. దేవ్ రాథోడ్ ఎడిటర్, రాజ్‌కుమార్ మురుగేశన్ ఆర్ట్ డైరెక్టర్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























