ఉస్తాద్‌ భగత్ సింగ్.. పవన్ షూట్ కంప్లీట్

Pawan Kalyan Wraps Up Shoot For Ustaad Bhagat Singh, Raashii Khanna Shares Selfie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ కీలక దశకు చేరుకుంది. తమిళ్‌లో సూపర్ హిట్ అయిన ‘తేరి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించి కీలక అప్డేట్ అందింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పవన్ కళ్యాణ్‌తో చివరి రోజు షూట్

ఆ మధ్య పవన్ కళ్యాణ్ డేట్స్ కుదరక కొన్ని నెలలపాటు ఆగిన షూటింగ్‌ ఇటీవలే మళ్ళీ మొదలైంది. ఇక ఉస్తాద్‌ షూట్ కోసం పవన్ భారీగా డేట్స్ ఇచ్చారు. దీంతో గత కొన్నిరోజులుగా షూటింగ్‌లో పాల్గొన్న పవర్ స్టార్ ఎట్టకేలకు తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారు. ఈ మేరకు తాజాగా హీరోయిన్ రాశీ ఖన్నా సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

“ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం”

చివరి రోజు పవన్‌తో ఒక సెల్ఫీ తీసుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా.. “ఇది పవన్ కళ్యాణ్ గారికి షూట్ ర్యాప్. ఆయనతో ఈ సినిమా పంచుకోవడం ఒక అద్భుత అనుభవం, నిజమైన గౌరవం. ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం” అని రాశీ ఖన్నా తన పోస్ట్‌లో భావోద్వేగంగా పేర్కొన్నారు.

ఫ్యాన్స్‌లో మరింత హైప్

ఇప్పటికే భారీ అంచనాలు సృష్టించిన ఈ సినిమా, రాశీ ఖన్నా పోస్ట్‌తో అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపింది. గబ్బర్ సింగ్ తరహా మాస్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోందనే టాక్ వినిపిస్తోంది.

పోస్ట్ ప్రొడక్షన్ వేగవంతం

పవన్ కళ్యాణ్ షూట్ ర్యాప్ పూర్తవడంతో, ఇప్పుడు సినిమా పోస్ట్-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగనున్నాయి. త్వరలోనే థియేటర్లలో సందడి చేయడానికి ఉస్తాద్ భగత్ సింగ్ సిద్ధమవుతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.