మా నాన్న సినిమా ‘దక్ష’ సూపర్ సక్సెస్ అవ్వాలి – మంచు మనోజ్

Manchu Manoj Wishes Blockbuster Success For His Father Mohan Babu’s Upcoming Film Daksha

మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అండ్ మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘దక్ష – ది డెడ్‌లీ కాన్స్పిరసీ’ (Daksha – The Deadly Conspiracy). ఈ సినిమాలో డాక్టర్ మంచు మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తండ్రీ కూతుళ్లు కలిసి మొదటి సారిగా ఈ చిత్రంలో నటించడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వంశీ కృష్ణ మల్లా కథ, స్క్రీన్‌ప్లేతో పాటు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇంకా సముద్రఖని, సిద్దిక్, విశ్వంత్, చిత్రా శుక్లా, రంగస్థలం మహేశ్, జెమినీ సురేష్, తదితరులు నటించారు. ఈ నెల 19న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాట్లాడుతూ.. “నా మిరాయ్ మూవీని సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్. నెక్ట్స్ వీక్ అక్క, నాన్న కలిసి నటించిన ‘దక్ష’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నా సినిమాను హిట్ చేశారు, అలాగే ఇప్పుడు మా నాన్న సినిమాను కూడా మీరు పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. ఈ సినిమా కోసం అక్క చాలా కష్టపడింది. దక్ష టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ చెబుతున్నా. ప్రస్తుతం ప్రేక్షకులతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి.”

“లిటిల్ హార్ట్స్ హిట్ అయ్యింది, బెల్లంకొండ సాయి కిష్కిందపురి మంచి విజయాన్ని అందుకుంది. అలాగే మా మిరాయ్‌ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఒకే రోజు రెండు చిత్రాలు రిలీజై మంచి విజయం సాధించాయి. అందుకు బెల్లంకొండ సాయి బ్రదర్‌కు కంగ్రాట్స్ చెబుతున్నా. నెక్ట్స్ దక్ష రాబోతోంది, ఆ తర్వాత ఓజీ వస్తోంది. ఈ నెల మూవీ లవర్స్ కు ఫీస్ట్ లా ఉంటుంది. అన్ని సినిమాలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. మన తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందాలని కోరుకుంటున్నా” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.