టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆల్కహాల్’ టీజర్ విడుదలకు రంగం సిద్ధమైంది. సంచలన టైటిల్‌తోనే ఈ సినిమా అంచనాలను భారీగా పెంచింది. ఈ సినిమా టీజర్ రేపు విడుదల కానుందని చిత్ర బృందం ప్రకటించింది. గత కొంత కాలంగా కామెడీ చిత్రాలకు దూరంగా ఉంటూ, కథాబలం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ వస్తున్న అల్లరి నరేష్, ఈసారి ‘ఆల్కహాల్’ అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తుండటం ఆసక్తికరంగా మారింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘ఫ్యామిలీ డ్రామా’ ఫేం మెహర్ తేజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ మరియు **శ్రీకర స్టూడియోస్’ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నరేష్ సరసన రుహాని శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా, గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను చూసిన తర్వాత, ఇందులో నరేష్ పూర్తిగా మద్యానికి బానిసైన వ్యక్తిగా కనిపిస్తారని అంతా భావించారు. అయితే, సినిమా టీజర్ ద్వారా అసలు కథాంశం ఏమిటనేది తెలుస్తుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రేపు విడుదల కానున్న టీజర్‌తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























