Mega157 టైటిల్ గ్లింప్స్ రిలీజ్

Mega157 Title Glimpse Released, Chiranjeevi’s Aura Sets Screen on Fire

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా, ఆయన నటిస్తున్న ‘మెగా157’ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. చాలా కాలంగా ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిజంగా ఒక గొప్ప శుభవార్త. ఈ మేరకు చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ PCX స్క్రీన్‌లో నిర్వహించిన గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో దీనిని విడుదల చేశారు. ఇక ఈ క్రేజీ అప్డేట్‌తో మెగాభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాకి “మన శంకరవరప్రసాద్ గారు” అనే టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. టైటిల్ అయితే అదిరిపోయింది. దీనికి వెంకేటేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ఇక టైటిల్ గ్లింప్స్‌ని గమనిస్తే, అనిల్ రావిపూడి సిగ్నేచర్ స్టైల్‌లో చిరుని చూడటం అభిమానులకు కన్నులపండుగగావుంది. ఇందులో వింటేజ్ మెగాస్టార్ కనిపించారు. చిరు లుక్స్ కానీ, గెటప్ కానీ ఎంతో ఫ్రెష్‌గా ఉంది. ఇంకా ఆయన బాడీ లాంగ్వేజ్, గ్రేస్, స్వాగ్.. అన్నీ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. అలాగే భీమ్స్ సిసిరోలియో అందించిన బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. చూస్తుంటే, ఈసారి మెగాస్టార్ గట్టిగా కొట్టబోతున్నారు అని అర్ధమవుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘మెగా157’ పై భారీ అంచనాలు

మెగా157 సినిమాను అనిల్ రావిపూడి వంటి మాస్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్నారని తెలిసినప్పటి నుంచి, ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. చిరంజీవి గారి కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి డైరెక్షన్ ఓ రేంజ్‌లో ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు. ఈ సినిమా ఒక పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తోంది. అలాగే ఈ చిత్రంతో మూడోసారి నయనతార చిరు సరసన నటిస్తుండటం మరో విశేషంగా మారింది.

బ్రేకింగ్ రికార్డ్స్ సిద్ధం!

ప్రస్తుతం ఈ టైటిల్ గ్లింప్స్ నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. అభిమానులు చిరు పోస్టర్‌లను షేర్ చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇక ఈ గ్లింప్స్ యూట్యూబ్‌లో రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ‘విశ్వంభర’ టీజర్ ఆల్రెడీ నిన్న సాయంత్రం రిలీజ్ అయింది. దీంతో మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఇలా రెండు సినిమాల అప్డేట్స్ వెంటవెంటనే రావడంతో ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా అందుకున్నట్టు అయింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.