నటీనటులు: అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత కృష్ణ, రాగ్ మయూర్, రాజేంద్రప్రసాద్, గౌతమ్ మేనన్, హర్షవర్ధన్ తదితరులు
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
సినిమాటోగ్రఫీ: మృదుల్ సుజిత్ సేన్
సంగీతం: గోపీసుందర్
నిర్మాణం: ఆనంద మీడియా బ్యానర్
నిర్మాత: విజయ్ డొంకాడ
దర్శకత్వం: ప్రవీణ్ కాండ్రేగుల
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినిమా కేవలం వినోదం మాత్రమే కాదు, కొన్నిసార్లు అది సమాజంలో ఉన్న వాస్తవాలను, మనసుకు హత్తుకునే భావోద్వేగాలను అద్దం పడుతుంది. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో తెలుగు, మలయాళంలో రూపొందిన ఈ ద్విభాషా చిత్రం అలాంటి ఒక ప్రయోగాత్మక చిత్రం. నటీనటుల అద్భుతమైన నటన, బలమైన కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా, లేదా? అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ:-
పడతి అనే ఒక గ్రామంలో తరాలుగా ఓ వింత ఆచారం ఉంటుంది. అక్కడి మహిళలు తమ భర్త, తండ్రి, తోబుట్టువులకు తప్ప మరెవరికీ తమ ముఖాలను చూపించకూడదు. ఒకవేళ ఎప్పుడైనా అనుకోకుండా ముఖం చూపిస్తే, స్థానిక దేవతను ప్రసన్నం చేసుకోవడానికి వారు ఆత్మహత్య చేసుకోవలసి ఉంటుంది. ఈ క్రమంలో ఆ గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మి (అనుపమ పరమేశ్వరన్), రాజేష్ (రాగ్ మయూర్)ల వివాహం నిర్ణయిస్తారు పెద్దలు.
అయితే ఆశ్చర్యకరంగా వీరి నిశ్చితార్థం రోజున, సుబ్బలక్ష్మి ముఖం పూర్తిగా బహిర్గతం చేయబడిన ముఖచిత్రంతో కూడిన ఒక పత్రిక వారి ఇంట్లోకి వస్తుంది. దీంతో ఆ నిశ్చితార్థం రద్దు అవుతుంది. గ్రామంలోని సంప్రదాయం ప్రకారం, నవజాత శిశువు చనిపోకుండా ఉండటానికి సుబ్బలక్ష్మి ఆత్మహత్య చేసుకోవాల్సి వుంటుంది.
ఈ నేపథ్యంలో సుబ్బలక్ష్మి, ఆమె స్నేహితురాలు రత్న (సంగీత) మరియు సివిల్ ఇంజనీర్ అమీషా (దర్శన) కలిసి ఆ మ్యాగజైన్ కవర్ వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలని భావిస్తారు. అసలు తన ముఖాన్ని బహిర్గతం చేసింది ఎవరు? దీని వెనుక ఉన్నది ఎవరు? ఏం ఆశించి చేశారు? ముగ్గురు స్నేహితులు కలిసి ఈ రహస్యాన్ని కనిపెట్టారా? చివరకు ఏం జరిగింది? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ:-
కథగా చూస్తే, సమాజంలో మహిళల స్వేచ్ఛను హరించే మూఢ నమ్మకాలు, వాటి కారణంగా స్త్రీలు పడే బాధలు కళ్ళకు కట్టినట్టు చూపింది ఈ చిత్రం. అలాంటి ఛాందసవాద నమ్మకాలను, స్త్రీ సాధికారికతను శక్తివంతంగా చూపించింది. ఒక స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి జీవితం ఊహించని ఒక్క సంఘటనతో ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేదానిని విపులంగా వివరించింది.
నటీనటుల ప్రదర్శన:-
- అనుపమ పరమేశ్వరన్ – తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సహజమైన ఎమోషన్లు, తనలోని నాజూకు కోణాలను బలంగా చూపించింది.
- దర్శన రాజేంద్రన్ – ఈ కథలో కీలకమైన రోల్‌లో కనిపించింది. సివిల్ ఇంజనీర్ అమీషాగా ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, సీరియస్ డైలాగ్ డెలివరీ చిత్రానికి కొత్త స్థాయిని ఇచ్చింది.
- సంగీత – ఎన్నో భావోద్వేగాలున్న పాత్రలో సహజంగా నటించింది. సాధారణ గృహిణి అయినా అవసరమైతే ఎంతకైనా తెగించే శక్తివంతమైన పడతిగా కనిపించింది. ఇక రాగ్ మయూర్ సహా ఇతర పాత్రలు కథకు తగ్గట్టు సహజంగా నడిచాయి.
టెక్నికల్ విభాగం:-
- దర్శకత్వం – దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల ఇంతకుముందు చేసిన చిత్రాల కంటే ఈసారి కొత్త తరహా స్టోరీటెల్లింగ్‌ని ఎంచుకున్నారు. సంబంధాలపై, మానవ భావోద్వేగాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
- సినిమాటోగ్రఫీ – చిత్రంలోని ప్రతి ఫ్రేమ్ ఒక ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. పల్లెటూరి వాతావరణాన్ని చక్కగా చూపించారు. విజువల్స్, రిచ్‌గా కనిపించాయి.
- మ్యూజిక్ – నేపథ్య సంగీతం కథను ముందుకు నడిపించే శక్తి చూపించింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలు, కొన్ని సన్నివేశాల్లో రీ-రికార్డింగ్ వింతగా వర్క్ చేసింది.
- ఎడిటింగ్ – కథనం కాస్త నెమ్మదిగా సాగిన చోట్ల కత్తిరించవచ్చు కానీ మొత్తం మీద ఎంగేజింగ్‌గా ఉంది.
- నిర్మాణ విలువలు – ప్రొడ్యూసర్ విజయ్ డొంకాడ ఈ ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌కి మంచి బడ్జెట్ వెచ్చించారు. ముఖ్యంగా, నాణ్యతలో ఎక్కడా రాజీ పడలేదు.
సినిమాను నిలబెట్టిన అంశాలు:-
- అనుపమ పరమేశ్వరన్ నటన
- బోల్డ్ కాన్సెప్ట్
- కొత్త తరహా స్టోరీ టెల్లింగ్
- దృశ్యపరంగా అద్భుతమైన ప్రెజెంటేషన్
- మ్యూజిక్ & బీజీఎమ్
- ఫ్యాన్స్ & ఆడియన్స్ రియాక్షన్
చివరగా..
‘పరదా’ అనేది తెలుగులో చాలా కొత్త అటెంప్ట్. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా కాకుండా, భావోద్వేగాలను మలిచిన న్యూ ఏజ్ డ్రామా. ట్రైలర్ విడుదలైనప్పటినుంచే దీనిపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా చూస్తున్నప్పుడు కూడా అలాగే కనిపించింది. అనుపమ నటన, భావోద్వేగాలు చాలా మందిని కట్టిపడేశాయి. యూత్‌కి, మల్టిప్లెక్స్ ఆడియన్స్‌కే కాకుండా అందరికీ కనెక్ట్ అయ్యేలావుంది ఈ సినిమా. మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఈ మూవీపై పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. మొత్తానికి పరదా అనుపమకి హిట్ అందించిందనే చెప్పొచ్చు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























