‘సినిమా బండి’ ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల ‘పరదా’ అనే మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, ప్రముఖ నటీమణులు దర్శన రాజేంద్రన్, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాగ్ మయూర్ ముఖ్యమైన పాత్ర పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలు మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఆగస్ట్ 22న పరదా థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. పరదా చాలా మంచి ఫిలిం. తెలుగులో విమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్ చాలా తక్కువగా వస్తాయి. ఈ సినిమా సక్సెస్ అయితే ఇలాంటి మరెన్నో సినిమాలు వస్తాయి. అనుపమ కూడా పెద్ద స్టార్. మీరందరూ కూడా ఫ్యామిలీతో కలిసి వెళ్లి ఈ సినిమా చూడండి. అనుపమ, సంగీత దర్శన ఇలా అద్భుతమైన పెర్ఫార్మన్స్‌తో ఈ సినిమా తీయడం జరిగింది.”
“ఈ సినిమా డబ్బులు వస్తే మిగతా ప్రొడ్యూసర్స్‌కి ఒక మంచి హోప్‌ని ఇస్తుందని భావిస్తున్నాను. పరదా సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వాలి. మన తెలుగు సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వాలి. అది నా కోరిక. మనం కూడా కంటెంట్ సినిమాలు చేయగలం. ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్‌ఫుల్ కావాలని కోరుకుంటున్నాను.” అని తెలిపారు.
“సినిమా మీకు నచ్చితే అందరూ కూడా నా కోసం ఒక్క ట్వీట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ ట్వీట్ మాకు చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి మొదటి పది నిమిషాలు చాలా ఇంపార్టెంట్. అందుకే ఎవరూ కూడా బిగినింగ్‌ని మిస్ అవ్వకూడదని కోరుకుంటున్నాను. ఆగస్టు 22 మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్ డే. అంతకంటే రెండు రోజులు ముందే ప్రివ్యూస్ వుంటాయి. రివ్యూస్ చూసే మీరు సినిమాకి వెళ్ళండి. అందరికీ థాంక్యూ.” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























