సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ గత గురువారం భారీ అంచనాలతో విడుదలై మొదటి నాలుగు రోజుల్లో సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల మార్క్ ను చేరుకుంది.కేవలం తమిళంలోనే కాదు అన్ని భాషల్లో ఈసినిమా అదరగొట్టింది.ఓవర్సీస్ లో అయితే భారీ వసూళ్లను రాబట్టుకుంది. నార్త్ అమెరికాలో అయితే 6 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది.ఓవరాల్ గా కూలీ ఓవర్సీస్ లో 4 రోజుల్లో 130 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తమిళనాడులో నిన్నటి వరకు 98 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి లియో కలెక్షన్స్ ను దాటేసింది.అయితే బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 10కోట్ల వరకు రాబట్టుకోవాల్సివుంది.ఇక ఈరోజు నుండి ఈసినిమాకు అసలైన పరీక్ష ఎదురుకానుంది.
లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో యాక్షన్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో నాగార్జున విలన్గా నటించగా సౌబిన్ షాహిర్ ,ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించారు.బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ క్యామియో రోల్ లో కనిపించాడు.మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈసినిమాకు సంగీతం అందించగా భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మించింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























