ఏజెంట్ తరువాత యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న సినిమా లెనిన్. ఇంతవరకు ఈసినిమా నుండి పెద్దగా అప్డేట్స్ అయితే బయటకి రాలేదు. సైలెంట్ గా షూట్ కానిచ్చేస్తున్నారు.రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక షూటింగ్ విషయానికి వస్తే సగానికిపైగా కంప్లీట్ అయ్యింది. వచ్చే నెల స్పెషల్ సాంగ్ ను షూట్ చేయనున్నారు.ఈ సాంగ్ కోసం ఓ ప్రముఖ హీరోయిన్ తీసుకోవాలనుకుంటుంన్నారట.త్వరలోనే ఈ హీరోయిన్ ఎవరనేది చెప్పనున్నారు.తమన్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ ,అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.అన్ని కుదిరితే నవంబర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఇక ఈసినిమా విజయం అఖిల్ కు కీలకం కానుంది.కెరీర్ లో సాలిడ్ హిట్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాడు అఖిల్.రెండేళ్ల క్రితం భారీ అంచనాల మధ్య వచ్చిన ఏజెంట్ నిరాశపరిచింది.దాంతో చాలా గ్యాప్ తీసుకొని లెనిన్ చేస్తున్నాడు.ఇక ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని అఖిల్ పట్టుదలతో వున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























