పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్, ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన లేటెస్ట్ నవ్వుల బ్లాక్ బస్టర్ మజాకా. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో రీతు వర్మ హీరోయిన్. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ నవ్వుల బ్లాక్ బస్టర్ మజాకా థాంక్స్ మీట్ ని నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ థాంక్స్ మీట్ లో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. “అందరికీ థాంక్యు. ఈ సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సినిమాకి అందరూ చాలా ప్రేమతో పని చేశారు. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి అందరికీ థాంక్స్. ముందుగా ప్రసన్న గారికి థాంక్స్ చెప్పాలి. నేను, త్రినాథ్ గారు కలిసి పని చేయాలని కోరిక ప్రసన్న గారికే ఎక్కువుంది.”
“చాలా సంవత్సరాలుగా అనుకున్నాం. ఫైనల్ గా మజాకాతో కుదిరింది. నేను చాలా ఎంజాయ్ చేసిన సినిమా ఇది. పిల్లలు, పెద్దలు థియేటర్ కి వెళ్లి పగలబడి నవ్వుకోవాలని ఉద్దేశంతో ఈ సినిమా చేశాం. నేను ఈ సినిమాని థియేటర్స్ లో చూశాను. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చివర్లో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. ఆడియన్స్ రెస్పాన్స్ కి బిగ్ థ్యాంక్స్.”
“ఆడియన్స్ సినిమా చాలా బాగుందని చెప్పడం ఆనందాన్ని ఇచ్చింది, సినిమా జనాల్లోకి వెళ్ళింది. తప్పకుండా ఈ సినిమాని థియేటర్లోకి వెళ్లి చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. పైసా వసూల్ సినిమా ఇది. థియేటర్స్ కి రండి. చాలా ఎంజాయ్ చేస్తారు. మా ఈవెంట్ కి గెస్ట్ గా అతిథులుగా వచ్చిన అందరికీ థాంక్యు. అనిల్ గారికి థాంక్యూ. రాజా నాకు బ్యాక్ టు బ్యాక్ రెండు మంచి సినిమాలు ఇచ్చాడు. తను మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























