యంగ్ హీరో విశ్వక్ సేన్ ,జాతిరత్నాలు ఫేమ్ అనిరుధ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే.కామెడీ డ్రామాగా రానున్న ఈసినిమాకు ఫంకీ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.ఇక ఈసినిమా షూటింగ్ నిన్నటి నుండి స్టార్ట్ అయ్యింది.ఈసినిమా కోసం డ్రాగన్ ఫేమ్ కయాదు లోహర్ ను హీరోయిన్ గా తీసుకున్నారు.ఆమె షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యింది.ప్రస్తుతం ఎల్ బి నగర్ లో హీరో, హీరోయిన్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.జూన్ లోపు ఈ సినిమాను పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫంకీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో విడుదలచేయనున్నారు.ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి.మరో వైపు ఈసినిమా విజయం విశ్వక్ సేన్ కు తప్పనిసరి కానుంది.తన చివరిమూడు సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి పరాజయం చెందాయి.దాంతో విశ్వక్ ,ఫంకీ తో ఎలాగైనా హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.
విశ్వక్ సేన్ కు తోడు మినిమమ్ గ్యారెంటీ డైరెక్టర్ ,టాప్ ఫామ్ లో వున్న మ్యూజిక్ డైరెక్టర్ ,టాప్ ప్రొడక్షన్ హౌస్ కాంబో లో వస్తుంది ఫంకీ.విశ్వక్ కు బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఇంతకన్నా మంచి ఛాన్స్ దొరకదు.మరి ఈ సినిమాతో కం బ్యాక్ ఇస్తాడో చూడాలి.ఇక ఈసినిమా కాకుండా విశ్వక్ మరో రెండు సినిమాలను కూడా లైన్లో పెట్టాడని సమాచారం.త్వరలోనే ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రానున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: