డెకాయిట్‌లో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్

DACOIT Team Introduces Anurag Kashyap as Inspector Swamy

అడివి శేష్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘డకాయిట్’ ఎక్సయిటింగ్ సినిమాటిక్ ఎక్సపీరియన్స్‌ని అందించబోతోంది. ప్రస్తుతం, హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మహారాష్ట్రలో లాంగ్ షెడ్యూల్‌తో కొనసాగుతుంది. మృణాల్ ఠాకూర్‌ ఈ చిత్రంలో కథానాయికగా ప్రకటించిన మేకర్స్ ఇప్పుడు తారాగణంలో మరో స్పెషల్ ఎట్రాక్షన్‌ని రివీల్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఈ ప్రాజెక్ట్‌లో ఒక పవర్ ఫుల్ పాత్రలో చేరారు. నిజాయితీ, ధైర్యవంతుడైన అయ్యప్ప భక్తుడైన ఫియర్ లెస్ ఇన్‌స్పెక్టర్‌గా నటించనున్నారు. చమత్కారం, వ్యంగ్యంతో కూడిన అతని పాత్ర యాక్షన్, ఎమోషన్, డ్రామాతో అలరించే కథనానికి డెప్త్‌ని యాడ్ చేస్తుంది.

క్యూరియాసిటీని పెంచుతూ మేకర్స్ ఇంటెన్స్, యాక్షన్-ప్యాక్డ్ న్యూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తనకు ద్రోహం చేసిన తన మాజీ ప్రియురాలిపై ప్రతీకారం తీర్చుకునే ఓ వ్యక్తి ప్రయాణాన్ని ప్రజెంట్ చేస్తూ కథ ప్రేమ, ద్రోహం, ప్రతీకారం, భావోద్వేగ కథగా వుండబోతోంది.

సినిమాలో చేరడం పట్ల అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. “అయ్యప్ప భక్తుడైన పోలీసు అధికారిగా నటించడం ఫన్ తో పాటు సవాలుతో కూడుకున్నది. విధికి వ్యతిరేకంగా ధర్మంతో పాటు తన పనిని హ్యుమర్‌తో చేయడం అద్భుతంగా ఉంది. ఈ పాత్రను రెండు భాషలలో పోషించడానికి ఎదురు చూస్తున్నాను, హిందీలో, తెలుగులో షూటింగ్ చేస్తున్నాను. రెండు భాషలలో ఒకే ప్రభావాన్ని చూపడం సవాలుతో కూడుకున్నది, దిన్ని పూర్తిగా ఆనందిస్తున్నాను” అని అన్నారు.

కాగా షనీల్ డియో దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తుండగా.. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తోంది. కథ, స్క్రీన్‌ప్లేను శేష్, షనీల్ డియో సంయుక్తంగా రూపొందించారు. ఈ చిత్రం హిందీ, తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడుతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.