ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’. గతంలో వీరి కాంబోలోనే వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 5న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’. గతంలో వీరి కాంబోలోనే వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 5న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే అది సినిమాలోని పాటో.. లేదంటే ఏదయినా సన్నివేశానిదో కాదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ పిక్ తెగ వైరల్ అవుతోంది. అందులో ఏదయినా విశేషముందా? అంటే.. సాధారణంగా అయితే ఉండదు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం విశేషమనే చెప్పుకోవాలి.
వివరాల్లోకి వెళ్తే.. ఈ చిత్రానికి గీత రచయితగా పనిచేసిన ఆస్కార్ అవార్డ్ విన్నర్ లిరిసిస్ట్ చంద్రబోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో రీసెంట్గా ఒక ఫోటోను షేర్ చేశారు. ఈ ఫొటోలో పుష్ప 2 సినిమా యూనిట్ లోని ముఖులందరూ ఉన్నారు. హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, చంద్రబోస్, నిర్మాతలు సహా మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కూడా ఉన్నారు.
మామూలుగా అయితే ఇందులో ఎలాంటి విశేషం లేదు. ఇంతకుముందు కూడా వీరు అనేకసార్లు కలిసి ఫోటోలు దిగారు. కాకపోతే ఇప్పుడు మాత్రం ఈ ఫోటో పలువురిని ఆకర్షిస్తోంది. కారణమేంటంటే..? ఇటీవలే పుష్ప 2 సినిమాకు కంపోజర్ ఎస్. తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నట్టు చెప్పడం గమనార్హం.
దీంతో ఈ వ్యవహారంపై ఫిల్మ్ నగర్ సర్కిల్లో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దేవి ఇచ్చిన బీజీఎమ్ హీరో అల్లు అర్జున్‌కి నచ్చలేదని, వారి మధ్య మనస్పర్థలు కూడా వచ్చాయని టాక్ నడుస్తోంది. దీంతో తమన్ సహా మరో ఇద్దరితో పుష్ప 2 బీజీఎమ్ కంపోజింగ్ జరుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా చంద్రబోస్ అందరూ కలిసి ఉన్న ఫోటో షేర్ చేసి ఈ అనుమానాలకు తెరదించారు.
కాగా ‘పుష్ప: ది రైజ్’ సినిమాకు కూడా దేవినే మ్యూజిక్ అందించడం తెలిసిందే. ఈ మూవీ లోని సాంగ్స్ అన్నీ చార్ట్ బస్టర్ అయ్యాయి. అలాగే ఈ చిత్రానికి గానూ డీఎస్పీ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి పుష్ప 2కి దేవి సంగీతం అందిస్తున్నారు. ఇక కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా ఇటీవలే వచ్చిన ‘కంగువా’ కి కూడా దేవినే మ్యూజిక్ డైరెక్టర్.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























