తమిళ హీరో శివ కార్తికేయన్ రేర్ ఫీట్ సాధించాడు.అమరన్ తో 300కోట్ల క్లబ్ లో చేరడమే కాకుండా రజినీకాంత్ ,విజయ్ తరువాత ఈ ఫీట్ సాధించిన మూడో తమిళ హీరోగా రికార్డు సృష్టించాడు.దీపావళికి వచ్చిన అమరన్ సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకుంటూ నిన్నటి తో 300కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.మూడో వారం లోకి ఎంట్రీ ఇచ్చినా ఊహించని రన్ తో సాలిడ్ వసూళ్లను దక్కించుకుంటుంది.కంగువా పోటీని కూడా తట్టుకొని జోరు చూపిస్తుంది.బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను మొదటి వారంలోనే క్రాస్ చేయడం తో బయ్యర్లకు భారీ లాభాలను తీసుకొస్తుంది.ఒక్క తమిళనాడు లోనే 100 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తెలుగు లోనూ ఈసినిమా అదరగొడుతుంది.నిన్నటి తో రెండు రాష్ట్రాల్లో కలిపి 40కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.కేవలం 8కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈసినిమా ఇప్పటికే రెట్టింపు లాభాలు తీసుకొచ్చింది.నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ ఈసినిమాను ఇక్కడ విడుదలచేసింది.ఇంతకుముందు విక్రమ్ తో కూడా ఈ సంస్థ సాలిడ్ ప్రాఫిట్స్ ను చూసింది.ఇప్పుడు అమరన్ అంతకుమించి లాభాలను తీసుకొస్తుంది.
మేజర్ ముకుంద్ బయోపిక్ గా రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించిన ఈసినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ఈసినిమాను నిర్మించింది.
ఇక శివ కార్తికేయన్ ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ తో సినిమా చేస్తున్నాడు.అనిరుధ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది.అమరన్ బ్లాక్ బాస్టర్ కావడంతో ఈసినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: