కోలీవుడ్ స్టార్ హీరో సూర్య డ్యూయల్ రోల్స్‌లో నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కంగువా’. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నాడు. దిశా పటాని హీరోయిన్గా నటిస్తుండగా.. బాబీడియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే కంగువా నుంచి రిలీజైన మూవీ గ్లింప్స్ వీడియో, పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ఫైర్ సాంగ్ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న కంగువా మూవీ ట్రైలర్ కూడా ఇటీవలే రిలీజై సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ ట్రైలర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇంతకుముందు రిలీజ్ చేసిన ట్రైలర్లో చూపించని మరికొన్ని సీన్స్ ఇందులో కనిపించాయి. కాగా కంగువ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా మొత్తం 10 భాషల్లో 3డీ వర్షెన్ సహా విడుదల కానుంది.
ఇక కంగువ రిలీజ్ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే.. వెయ్యిళ్ల కిందట ఐదు తెగల మధ్య సాగే పోరాటం నేపథ్యంగా, ఓటమి ఎరుగని ధీరుడైన నాయకుడు కంగువను ఒకవైపు, ప్రస్తుత కాలంలోని స్టైలిష్ హీరోను మరోవైపు చూపిస్తూ ట్రైలర్ ప్రారంభమైంది. వెయ్యేళ్ల కిందట కంగువ చేసిన ప్రామిస్ ఏంటి, ఆ మాటను ఈనాటి కథానాయకుడు ఎలా నిలబెట్టాడు అనేది ఆసక్తికరంగా చూపిస్తూ ట్రైలర్ సాగింది.
ఒక వీరుడి ప్రతిజ్ఞ ఏంటి?, అతన్ని మోసం చేసిందెవరు?, ఆ వీరుడు పునర్జన్మ ఎత్తాడా?, అతను నిలబెట్టిన గౌరవం ఎలాంటిది? అనే అంశాలతో క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. వెయ్యేళ్ల కిందటి కంగువ ప్రపంచాన్ని ఎలా క్రియేట్ చేశారో, అంతే అల్ట్రా మోడరన్ గా నేటి కథనాయకుడి ప్రపంచాన్ని ఆవిష్కరించారు. ఈ రెండు పాత్రల్లో సూర్య నట విశ్వరూపం కనిపించింది.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ‘ధీర ధీర కదన విహార.. ధీర.’ పాట బీజీఎం కంగువ ట్రైలర్ ఇంటెన్సిటీ పెంచింది. కంగువ మీద మరిన్ని అంచనాలు పెంచేలా ఈ రిలీజ్ ట్రైలర్ ఉండి ఆకట్టుకుంటోంది.
కాగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యూవీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తోంది. కాగా ఈ సినిమాను నైజాం ఏరియాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతుండగా.. ఓవర్సీస్ రైట్స్‌ను ‘ఫార్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్’ సంస్థ దక్కించుకుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























