టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ కాంబోలో తెరకెక్కుతోన్న మోస్ట్ ఎవైటెడ్ మల్టీ-స్టారర్ ‘జీబ్రా’. లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనే ట్యాగ్‌లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిసినాటో, సత్య అక్కల, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇటీవలే హీరో సత్యదేవ్ ఫస్ట్ లుక్ సహా ఇందులోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ మైండ్ బ్లోయింగ్ క్యారెక్టర్ రివీలింగ్ మోషన్-పోస్టర్ రిలీజ్ చేయగా, దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో రేపు జీబ్రా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు మేకర్స్. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. ఈ మేరకు చిత్ర బృందం సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది.
కాగా సత్యదేవ్ ఇంతకుముందు చిరు ‘గాడ్ ఫాదర్’ సినిమాలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక చిన్న చిత్రాలను, అప్ కమింగ్ హీరోలను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుండే మెగాస్టార్ సత్యదేవ్ సినిమా కోసం రానుండటంతో మెగాభిమానులు ఈ చిత్రంపై ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా నవంబర్ 22న జీబ్రా అన్ని దక్షిణ భారత భాషల్లో మరియు హిందీలో థియేటర్లలోకి రానుంది.
కాగా ఈ సినిమాను పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై SN రెడ్డి, S పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తుండగా.. ఎస్ శ్రీలక్ష్మి రెడ్డి సహ నిర్మాతగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సాంగ్స్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తుండగా.. సత్య పొన్మార్ సినిమాటోగ్రఫీ, అనిల్ క్రిష్ ఎడిటింగ్, మీరాఖ్ డైలాగ్స్ అందిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: