ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఇండియన్ ఫిల్మ్ ‘పుష్ప-2 ది రూల్’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 12 వేల స్క్రీన్స్‌లో అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డిసెంబరు 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం యూఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంది. అయితే ఈ చిత్రం ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం భారతదేశంలోని సినీ ప్రేమికులు, ఐకాన్ స్టార్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రం ప్రమోషనల్ ఈవెంట్స్‌ను ఇండియాలోని ఏడు మేజర్ సిటీస్‌లో నిర్వహించబోతున్నట్లుగా మేకర్స్ అఫీషియల్‌గా విడుదల చేసిన ఓ వీడియో ద్వారా తెలియజేశారు.
పాట్నా, కలకత్తా, చెన్నయ్, కొచ్చి, బెంగళూరు, ముంబయ్, హైదరాబాద్‌లో ఈ మాసివ్ ఈవెంట్స్‌ను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం ఒకవైపు చివరి దశలో వున్న చిత్రీకరణతో పాటు మరో వైపు నిర్మాణానంతర పనులను ఈ చిత్రం జరుపుకుంటోంది. ఇక బాక్సీఫీస్ రికార్డులను రూపుమాపడానికి, ఇండియాను కలెక్షన్ల తుఫాన్ షేక్ చేయడానికి ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్-సుకుమార్‌ల వండర్‌ఫుల్ ఫిల్మ్ పుష్ప-2 ది రూల్ సర్వాంగ సుందరగా ముస్తాబు అవుతుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























